Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2010 (11:31 IST)
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్ ఆదివారం నుంచి డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ గ్రౌండ్‌లో ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌ జరిగిన సెంచూరియన్ సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50వ టెస్టు సెంచరీ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సఫారీ జట్టు సిరీస్‌లో 0-1 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

ఈ నేపథ్యంలో డర్బన్‌లో జరిగే రెండో టెస్టులో ఖచ్చితంగా విజయం సాధించి సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని టీమ్ ఇండియా గట్టిపట్టుదలతో ఉంది. ఇకపోతే రెండో టెస్టుకు పేస్ బౌలర్ జహీర్‌ఖాన్ గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగనుండటం భారత జట్టుకు శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అయితే, ఓపెనర్ గంభీర్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.

ఇషాంత్ శర్మ, శ్రీశాంత్‌లు సరిగా రాణించలేకపోతుండటంతో పస తగ్గిన భారత పేస్ బౌలింగ్ విభాగానికి జహీర్‌ఖాన్ పునరాగమనంతో కొండంత అండ లభించినట్టయింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే, సెంచూరియన్ టెస్టులో పదునైన పేస్ బౌలింగ్‌తో భారత్‌కు చుక్కలు చూపించిన డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్‌లతో పాటు పాల్ హారిస్, లోన్వాబో సొత్సోబ్‌లతో పటిష్టమైన బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు.. హాజరవుతారో? లేదో?

జనవరి 8న నరేంద్ర మోదీ పర్యటన- సర్వం సిద్ధం చేస్తోన్న ఏపీ సర్కారు

హోం మంత్రి అనిత పీఏ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు.. పదవి నుంచి అవుట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి నిర్మాత నాగవంశీ కి మధ్య విభేధాలు !

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

Show comments