Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీపై నేడు తుది నిర్ణయం

Webdunia
ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ కొనసాగాలా..? లేదా..? అనే అంశంపై ఆదివారం నాడు జరగనున్న ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని కౌన్సిల్‌కు చెందిన ఒక సభ్యుడు తెలిపారు.

ఈ సమావేశంలో పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్న న్యాయపరమైన వ్యాజ్యాలపై కూడా పాలక మండలి దృష్టి సారించనుంది. యాజమాన్య వాటాల విషయంలో ఉన్న వివాదాలకు ముగింపు పలిక ి, ఒకే కంపెనీగా ఏర్పడేందుకు కొచ్చికి గతంలో బీసీసీఐ నెల రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే.

గతవారం గడువు చివరి రోజున వాటాదారుల ఒప్పందాన్ని బోర్డుకు సమర్పించింది. ఈ ఫ్రాంచైజీలో 74 శాతం వాటాలను నాలుగు కంపెనీలకు చెందిన పెట్టుబడిదారులు కలిగి ఉన్నారు. కాగా.. దీని బిడ్డింగ్‌కు సహకరించిన గైక్వాడ్ కుటుంబానికి ఇందులో 26 శాతం ఉచిత వాటాలున్నాయి.

కానీ.. గైక్వాడ్ కుటుంబానికి ఆ 26 శాతం వాటాలను ఇచ్చేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా లేరు. దీంతో ఈ వివాదం ప్రారంభమైంది. మరోవైపు తమ కేసులో మధ్యవర్తిగా జస్టిస్ శ్రీకృష్ణను బీసీసీఐ కావాలనే వద్దంటోందని పంజాబ్ ఆరోపణలు చేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Show comments