Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టెస్ట్: కివీస్ బ్యాట్స్‌మెన్ల భరతం పట్టిన బౌలర్లు!

Webdunia
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం నుంచి మూడో టెస్టు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. శనివారం ఉదయం మైదానం చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ను మధ్యాహ్నం తర్వాత ప్రారంభించారు. ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ వెట్టోరి బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో ఓపెనర్లుగా మిషితోష్, గుప్తిల్‌‍లు బరిలోకి దిగారు.

జట్టు స్కోరు 11 పరుగుల మీద ఉండగా శ్రీశాంత్ బౌలింగ్‌లో గుప్తిల్ తన వ్యక్తిగత స్కోరు ఆరు పరుగుల వద్ద కీపర్ ధోనీకి క్యాచ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఐదు పరుగులు జోడించిన తర్వాత మిషితోష్ కూడా శ్రీశాంత్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 16 పరుగులు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన టేలర్ (20), రైడర్ (59)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

అయితే, జట్టు స్కోరు 42 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో టేలర్ వికెట్ల ముందు దొరికి పోయాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన విలియమ్సన్ డకౌట్ అయ్యాడు. ఈవికెట్‌ను ప్రజ్ఞాన్ ఓఝా దక్కించుకున్నాడు. తర్వాత వచ్చిన వెట్టోరి కూడా మూడు పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి కివీస్ స్కోరు 51 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో హాప్‌కిన్స్ ఏడు పరుగులు చేసినప్పటికీ.. జట్టు స్కోరును రైడర్‌తో కలిసి 82 పరుగులకు చేర్చాడు. అయితే, ఓఝా బౌలింగ్‌లో హాప్‌కిన్స్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కివీస్ 82 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రైడర్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ముగియనున్న సమయంలో రైడర్ (59)‌ను హర్భజన్ సింగ్ అవుట్ చేశాడు.

దీంతో కివీస్ జట్టు 124 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి మెక్ కల్లమ్ (34), సౌథీ (7) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలావుండగా, తొలి రోజు ఆట 90 ఓవర్లకు గాను 56 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. ఇకపోతే భారత బౌలర్లలో శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓఝాలు రెండేసి వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

Show comments