Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విజ్ మాస్టర్‌గా సౌరవ్ సరికొత్త అవతారం

Webdunia
అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరైన టీం ఇండియా మాజీ కెప్టెన్, కోల్‌కత ప్రిన్స్ సౌరవ్ గంగూలీ ఓ టెలివిజన్ రియాలిటీ ‌షోకు క్విజ్ మాస్టర్‌గా సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. "జీ బంగ్లా" అనే ప్రముఖ బెంగాలీ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ఓ రియాలిటీ షోలో దాదా "దాదాగిరి" చేయనున్నాడు.

ఈ విషయమై ప్రముఖ బెంగాళీ దినపత్రిక "ఆనంద బజార్ పత్రిక" ఓ వార్తా కథనం వెలువరించింది. వారానికోసారి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి, జీ బంగ్లా ఛానెల్‌వారి ప్రతిపాదనను తాను అంగీకరించాననీ, క్విజ్ షోను ఎలా నిర్వహించాలో ఇప్పటికే తెలుసుకున్నానని గంగూలీ చెప్పినట్లుగా ఆ కథనం పేర్కొంది.

రియాలిటీ షోకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకాలు కూడా దాదా ఇప్పటికే సంతకాలు కూడా చేసేశారని పై పత్రికా కథనం వెల్లడించింది. మొదట 72 ఎపిసోడ్ల దాకా ప్రసారం చేయనున్న ఈ క్విజ్ కార్యక్రమం బాగా పాపులర్ అయిన తరువాత మరింతగా పెంచే ఆలోచనలో జీ బంగ్లా ఉన్నట్లు ఆనంద బజార్ పత్రిక వెల్లడించింది.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమానికి "దాదాగిరి" అనే పేరును ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆనంద బజార్ పత్రికా కథనం తెలియజేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

Show comments