Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారూల ఆధిపత్యానికి చెల్లుచీటీ...!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2008 (17:11 IST)
సమకాలీన క్రికెట్‌లో ఎదురన్నదే లేకుండా ఉజ్వలంగా వెలిగిన ఆసీస్ కథ ముగిసినట్లేనా మరి... ఈ ప్రశ్నకు ఆసీస్ మీడియా అవుననే సమాధానమిస్తోంది మరి. మొహాలీలో ఆసీస్ జట్టు ఎదుర్కొన్న పరాభవం ప్రపంచ ఛాంపియన్లపై భారత్ ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పిందని ఆసీస్ ఢంకా భజాయించి మరీ చెబుతోంది.

ఆధిపత్య శకానికి అంతం అనే శీర్షికలో ది ఆస్ట్రేలియన్ పత్రిక ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పింది. ఇటీవలి కాలంలో ఏ జట్టు చేతిలోను ఆసీస్ జట్టు ఇంతగా ఓడిపోయిన చరిత్రను మనం చూసి ఉండలేదని ఈ పత్రిక వివరించింది. 320 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఘోరంగా ఓడిపోయిన వైనం చూస్తూ ఉంటే ఆసీస్ జట్టుపై భారత్ ఆధిపత్యం మరోసారి నిరూపించబడినట్లేనని స్పష్టం చేసింది.

ఈ ఏడాది మొదట్లో సిడ్నీ టెస్టులో తృటిలో విజయాన్ని జార్చుకున్న ఘటనను మినహాయిస్తే అప్పటినుంచి భారత్ రెండు విజయాలు, రెండు డ్రాలతో ఆసీస్‌పై తిరుగులేని విజయాన్ని సాధించిందని ది ఆస్ట్రేలియన్ పత్రిక కితాబిచ్చింది. జగ్జజ్జేత ఆస్ట్రేలియాను మొహాలీ టెస్టులో దునుమాడి మరీ లొంగదీసుకున్న భారత్ జట్టు ప్రపంచ క్రికెట్ దశను మార్చిందని పేర్కొంది.

భారత్ దెబ్బతో ప్రపంచ ఛాంఫియన్ ఆస్ట్రేలియా తన ప్రతిష్టనే కాక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సైతం కోల్పోయే స్థితిలో పడిందని పత్రిక వ్యాఖ్యానించింది. కాగా డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ఈ పరాజయంపై వ్యాఖ్యానిస్తూ కాలు దువ్వుతున్న భారత్‌పై ఘోరపరాజయం పొందిన ఆసీస్ తన నైతిక ధృతిని కోల్పోయిందని పేర్కొంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వార్న్ వంటి దిగ్గజ ఆటగాళ్లు రిటైరవడంతో ఆసీస్ టీమ్ అనుభవం లేమి ఎన్నడూ లేనంత స్పష్టంగా మొహాలీలో ప్రదర్శితమయిందని వివరించింది.

మొహాలీ మ్యాచ్‌లో భారత్ ముందు ఆసీస్ ఎందుకూ కొరగాకుండా పోయిందని, దశాబ్దం పైగా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేకుండా ఆధిపత్యాన్ని చలాయించిన ఆసీస్ జట్టు కోలుకోలేని దెబ్బ తిందని డైలీ టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది. 1995లో ప్రపంచ క్రికెట్ కిరీటాన్ని చేజిక్కించుకున్నప్పుడు ఆస్ట్రేలియా ఆనాటికి చేష్టలుడిగిన వెస్టిండీస్ జట్టును ఎలా చూసిందో ఇప్పుడు భారత్ చేతిలో ఆసీస్‌కు
అదే గతి పట్టనుందని పేర్కొంది.

మెగ్రాత్, వార్న్, గిల్లీ జట్టులోంచి వైదొలిగినప్పటికీ గత ఏడాదిగా ఆసీస్ తన లోపాలను మరుగున ఉంచుకుని తన్ను తాను కాపాడుకుందని అయితే మొహాలీలో మాత్రం దాని డొల్లతనం నగ్నంగా బయటపడిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే మరో పత్రిక పేర్కొంది. భారత్ దెబ్బకు ఆసీస్ జట్టు రెండు కాళ్ల మధ్యలో తన తోకను దాచుకుని ముడుచుకుపోయిందని తెలిపింది.

మొహాలీ పరాజయం ఆసీస్ క్రికెట్ పరాజయమని ఇకపై ఆసీస్ జట్టూ, ఆసీస్ క్రికెటర్లు కాస్త వినయంగా ఉండటం నేర్చుకోవాలని సుప్రసిద్ధ క్రికెట్ వ్యాఖ్యాత పీటర్ రోబక్ చెప్పారు. భారత్ సీనియర్ల సర్దుబాటులో పడిపోయింది కాబట్టి తాము ఆ జట్టుపై కొత్త తరం ఆటను ప్రయోగిస్తామని సీరీస్ మొదట్లో పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను పీటర్ ఎద్దేవా చేశారు.

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, ఎత్తుగడలు, పరుగులు, కేప్టెన్సీ, ప్రతిభ ఇలా ఏ విభాగంలో తీసుకున్నా రికీ పాంటింగ్ జట్టు భారత్‌ ముందు కుప్పగూలిపోయిందని పీటర్ రోబోక్ తేల్చి చెప్పారు. మాటలకారి ఆసీస్‌తో పోలిస్తే భారత్ మెత్తగా తన పని తాను చేసుకుపోయిందని బంతిబంతికీ ఆసీస్‌ను కుళ్లబొడుస్తూ వచ్చిందని పీటర్ చెప్పారు.

ఈ సంవత్సరం మొదట్లో బాక్సింగ్ డే టెస్టు జరిగినప్పటి నుంచి ఆసీస్ సిడ్నీ టెస్టులో కుతంత్రాలతో గెలిచిన ఘటన మినహాయిస్తే తర్వాత భారత్‌పై గెలిచిన దాఖలా లేదని అప్పటినుంచి భారత్ ఆసీస్‌పై రెండు విజయాలు, రెండు డ్రాలు చేసిందిని ది ఏజ్ పత్రిక పేర్కొంది. భారతీయ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, ఓపెనింగ్ బౌలర్లు మొహాలీ పోరులో పూర్తిగా ఆధిపత్యం చలాయించారని తెలిపింది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments