Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)
వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియాన్ని 1978 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యే ఆ రాష్ట్ర క్రీడాకారులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అదేసమయంలో ఈ స్టేడియంలో వర్షపు వెళ్లేందుకు సరైన వసతులు లేవు. 
 
అయితే, తాజాగా భారీవర్షం కురవడంతో స్టేడియంలో వర్షం నీరు నిలిచింది. అదేసమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయం తెలియని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ స్టేడియంలోకి రోజువారీగా ప్రాక్టీస్ చేసేందుకు రాగా, విద్యుదాఘాతానికి గురై అపస్మారకంగా పడిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్ కుమార్ వర్మను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలానాథ్ సింగ్ తెలిపారు.
 
విశాల్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ భాలోనాథ్ సింగ్ చెప్పారు. అలాగే, కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిన్నెల్లి సోదరులకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ముందస్తు బెయిల్‌కు నో

ప్రజారోగ్యానికి ఏపీ సర్కారు పెద్దపీట : గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు

ఇన్‌స్టాలో భర్తకు విడాకులు.. ప్రియుడుతో కలిసి దుబాయ్ యువరాణి ర్యాంప్ వాక్

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

Honey Rose: బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులు.. మెరిసిపోయిన హనీరోజ్ (Photos)

తర్వాతి కథనం
Show comments