Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడ్రిడ్ ఓపెన్లో ఖంగుతిన్న టాప్ సీడ్లు: సెరెనా విలియమ్స్‌కు ఫ్లూ..!

Webdunia
సోమవారం, 2 మే 2016 (18:29 IST)
మాడ్రిడ్ ఓపెన్‌ తొలి రౌండ్లోనే టాప్ సీడ్లకు చుక్కెదురైంది. ఈ టోర్నీకి ఫ్లూ జ్వరంతో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, అమెరికా నల్ల కలువ సెరీనా విలియమ్స్ దూరమైన నేపథ్యంలో, టాప్ సీడ్స్‌గా ఈ టోర్నీ బరిలోకి దిగిన క్రీడాకారులు అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. 
 
టాప్‌సీడ్‌ రద్వాన్‌స్కా, ఆస్ట్రేలియా ఓపెన్‌ మాజీ ఛాంపియన్‌, రెండోసీడ్‌ ఏంజెలిక్‌ కెర్బెర్‌ తొలిరౌండ్లోనే ప్రత్యర్థుల చేతిలో ఖంగుతిన్నారు. ప్రత్యర్థులపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యారు. 
 
ప్రత్యర్థుల షాట్లను ధీటుగా ఎదుర్కొన్నా టాప్ సీడ్లైన కెర్బెర్, రద్వాన్‌స్కాలకు ఓటమి తప్పలేదు. కాగా స్లోవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవాతో తలపడిన రద్వాన్‌స్కా 6-4, 6-7 (3/7), 6-3 తేడాతో ఓడిపోగా, జర్మనీ క్రీడాకారిణి రెండో సీడ్ కెర్బర్ బార్బరా (చెక్ రిపబ్లిక్) చేతిలో 6-4, 6-2తో ఘోర పరాజయం పాలైంది.
 
అలాగే పురుషుల సింగిల్స్‌లో బల్గేరియన్ క్రీడాకారుడు దిమిత్రోవ్.. 6-7 (5-7) 7-6 (7-4) 6-0 పాయింట్ల తేడాతో డిగో చేతిలో ఖంగుతిన్నాడు. తద్వారా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీని ఓడించాలంటే కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవాలి : శరద్ పవార్

పశు సంపదను పూజించే పవిత్ర కార్యక్రమం కనుమ : సీఎం చంద్రబాబు

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!

టూరిస్ట్ బస్సులో మంటలు - నిజామాబాద్ వాసి సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే ఎలా.. మీ జీవితం మాటేంటి? ఫ్యాన్స్‌కు అజిత్ ప్రశ్న

కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!

వినూత్న కాస్పెప్ట్ గా లైలా ను ఆకాంక్ష శర్మ ప్రేమిస్తే !

90s వెబ్ సిరీస్ లో పిల్లవాడు ఆదిత్య పెద్దయి ఆనంద్ దేవరకొండయితే !

బాలక్రిష్ణ, రామ్ చరణ్ రిలీవ్ చేసిన శర్వానంద్, నారి నారి నడుమ మురారి టైటిల్

తర్వాతి కథనం
Show comments