Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్ : రష్యా నిష్క్రమణ.. క్రొయేషియా గెలుపు

ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో

Webdunia
సోమవారం, 9 జులై 2018 (11:19 IST)
ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైంది. ఫలితంగా రష్యా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా రెండు జట్లూ విజయం కోసం కొదమసింహాల్లా తలపడ్డాయి. 
 
1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది. మరోవైపు పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా సొంత ప్రేక్షకుల మద్దతుతో రష్యా జట్టు.. క్రొయేషియాను వణికించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments