Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెస్సీ : కప్ గెలవాలనుకున్నాను.. అసలేదీ నాకొద్దు!

Webdunia
మంగళవారం, 15 జులై 2014 (16:00 IST)
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తమ జట్టు ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నేపథ్యంలో తనను ఏ అవార్డూ ఓదార్చలేదని అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీ అంటున్నాడు. 
 
అర్జెంటీనా ప్రజల కోసం కప్ గెలవాలనుకున్నానని, ఇప్పుడు ఏ బహుమతి గురించి పట్టించుకోబోనని, అసలేదీ తనకు అవసరం లేదన్నాడు. ప్రస్తుతం తనను ఏదీ ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జర్మనీతో ఫైనల్లో మూడు ఛాన్సులు మిస్ చేసుకున్నామని మెస్సీ తెలిపాడు. అందులో ఒకటి తాను వృథా చేశానని చెప్పాడు.
 
కాగా, వరల్డ్ కప్‌లో నాలుగు గోల్స్ చేసిన మెస్సీకి ఫిఫా 'గోల్డెన్ బాల్' ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. మెస్సీకి అవార్డుపై మాజీ ఆటగాడు మారడోనా మండిపడుతూ, అతడు ఆ పురస్కారానికి అనర్హుడని విమర్శించిన సంగతి విదితమే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments