Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను డాబాపైకెక్కి గట్టిగా అరవాలా?: సానియా మీర్జా(Video)

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (14:23 IST)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పాకిస్థాన్ కోడలైన సానియామీర్జాను తొలగించి తెలంగాణాకు చెందిన క్రీడాకారులకు ఆ హోదా ఇవ్వాలని ఆయన కోరారు. 
 
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడులపై పలువురు నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు స్పందించిన నేపథ్యంలో.. భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా ఖండించకపోవడంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
 
పుల్వామా ఘటనను ఆమె ఖండించకపోవడంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సానియా మీర్జాకు ఎక్కడలేని కోపం వచ్చింది. పుల్వామా దాడులను ఖండించి.. తాను డాబాపైకెక్కి గట్టిగా అరవాలా అంటూ ప్రశ్నించింది. సాధారణంగా సెలెబ్రిటీలు ఇలాంటి ఘటనలపై తప్పక స్పందించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. 
 
వాళ్లకు తానేం చెప్పాలనుకుంటున్నానంటే.. మీ కోపతాపాలను మాలాంటి సెలెబ్రిటీలపై చూపిస్తున్నారు. పుల్వామా ఘటనపై సోషల్ మీడియాలో ఖండించాలనే అవసరం తనకు లేదని సానియా తేల్చేసింది. అలా కాకుంటే మా ఇంటి డాబాపైకెక్కి.. నిలబడి అరవమంటారా అంటూ ఆవేశానికి గురవుతూ ప్రశ్నించింది. 
 
తీవ్రవాదంపై సోషల్ మీడియాలోనే ఖండిస్తూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తీవ్రవాదాన్ని ఎక్కడైనా తీవ్రంగా ఖండిస్తాను. అలాగే ఉగ్రవాద చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పింది. స్థిమితంగా ఆలోచించే వారందరూ ఉగ్రవాదాన్ని ఎదిరించే వారే. తాను దేశం కోసం చెమటోర్చి ఆడుతాను. అలాగే తాను దేశానికి సేవ చేస్తున్నాను. పుల్వామా దాడుల్లో అమరులైన సైనికుల కుటుంబానికి తాను అండగా వుంటాను. అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ప్రార్థన చేసుకుంటున్నానని సానియా మీర్జా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

తర్వాతి కథనం
Show comments