Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో సెరెనా పాప ఫోటోలు... వెక్కి వెక్కి ఏడ్చిందన్న మరియా షరపోవా?

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తల్లైన సంగతి తెలిసిందే. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో సెరెనా కుమార్తె ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:50 IST)
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తల్లైన సంగతి తెలిసిందే. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో సెరెనా కుమార్తె ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్న 35 ఏళ్ల సెరెనా సెప్టెంబర్ ఒకటో తేదీన పాపాయికి జన్మనిచ్చింది.

పాపకు అలెక్సిన్ ఒలింపియా ఒహానియర్ జూనియర్ అనే పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు ఉన్నానని, గర్భం దాల్చినప్పటి నుంచి పాపకు జన్మనిచ్చేంత వరకు జరిగిన పరిణామాలపై సెరెనా డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. 
 
ఇలా పాపాయి పుట్టిన సంతోషంలో వున్న సెరెనా విలియమ్స్‌పై రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తన ఆటోబయోగ్రఫీలో వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. దశాబ్ధకాలం పాటు టెన్నిస్‌లో రాణించిన సెరెనా తనపై ద్వేషం పెంచుకుందని ''అన్‌ స్టాపబుల్‌ –మై లైఫ్‌ సో ఫర్''లో షరపోవా వెల్లడించింది.

తన శ్వేత వర్ణం వల్లే సెరెనా తనపై ద్వేషభావం పెంచుకుందని చెప్పుకొచ్చింది. గత 13 ఏళ్లుగా ఈ శత్రుత్వం కొనసాగుతోందని షరపోవా చెప్పింది. సెరెనాను ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తాను ఓడించడం, ఆ ఓటమి బాధతో ఆ నల్లకలువ లాకర్‌ రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్వడాన్ని తన ఆటోబయోగ్రఫీ షరపోవా వివరించింది. 
 
ఇంకా చెప్పాలంటే తన భారీ, బలమైన శరీరంతోనే ఆమె తనను భయపెట్టేసేదని షరపోవా ఆ పుస్తకంలో రాసింది. అయితే షరపోవా మాటలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపించాయి. 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన సెరెనాతో 5 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన షరపోవాకు అసలు పోలికే లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments