Webdunia - Bharat's app for daily news and videos

Install App

90 యేళ్ళ బామ్మకు జెర్సీని బహుకరించిన విరాట్ కోహ్లీ.. ఎక్కడ?

క్రికెట్ మైదానం నలువైపులా క‌ళ్ళు చేదిరే షాట్లతో బంతిని తరలిస్తూ క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీపై అభిమానులు చూపిస్తున్న ప్రేమానురాగాలు దేశ హద్దులు స

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (13:12 IST)
క్రికెట్ మైదానం నలువైపులా క‌ళ్ళు చేదిరే షాట్లతో బంతిని తరలిస్తూ క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీపై అభిమానులు చూపిస్తున్న
ప్రేమానురాగాలు దేశ హద్దులు సైతం చెరిగిపోతున్నాయి. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా తనని కలిసేందుకు వచ్చిన అభిమానులకి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తుంటారు. ఈ యేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాక్‌ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌కు విరాట్‌ కోహ్లీ ఓ బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. 
 
తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇటీవల అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ఆడేందుకు అక్కడికి వెళ్లిన విరాట్‌ కోహ్లీని ఓ వీరాభిమాని కలిశారు. దాదాపు 90ల్లో ఉన్న ఓ బామ్మ శ్రమించి తనను కలిసేందుకు ప్రత్యేకంగా రావడంతో ఆనందంలో మునిగిపోయిన విరాట్‌ కోహ్లీ. ఆమెకు మైదానంలో తాను ధరించే జెర్సీని బహుకరించేశాడు. ఇప్పటివరకు తన మనసుకు నచ్చిన వారికి ఎక్కువగా బ్యాట్‌లనే బహుమతిగా ఇచ్చే విరాట్‌ కోహ్లీ బామ్మకి మాత్రం జెర్సీని అందజేసి అతి'పెద్ద' అభిమాని కళ్లలోని ఆనందాన్నిచూసి మురిసిపోయాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments