Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగు పందెంలోనే కాదు.. పిల్లలు పుట్టించడంలోనూ దూకుడే. బోల్ట్‌కు కవలలు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (12:36 IST)
పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ మరోమారు తండ్రి అయ్యాడు. అదీకూడా ఇద్దరు పిల్లలు. బోల్ట్ భార్య తాజాగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తనకు ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు పుట్టిన‌ట్లు బోల్ట్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 
 
ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో అత‌ను ఈ విష‌యాన్ని చెప్పాడు. ఆ ఇద్ద‌రు కుమారుల‌కు థండ‌ర్ బోల్ట్‌, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టారు. అయితే ఆ పిల్ల‌లు ఎప్పుడు పుట్టార‌న్న విష‌యాన్ని మాత్రం ఉసేన్ చెప్ప‌లేదు. బోల్ట్ భార్య బెన్నెట్ కూడా క‌వ‌ల‌ల ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 
 
ఆ ఫోటోలో వారి కూతురు ఒలింపియా లైట‌నింగ్ బోల్ట్ కూడా ఉంది. 2020 మేలో ఒలింపియా బోల్ట్ పుట్టింది. కానీ రెండు నెల‌ల త‌ర్వాత ఆమెకు పేరు పెట్టారు. ఫ్యామిలీ ఫోటోను తాజాగా పోస్టు చేయ‌డంతో బోల్ట్ ఫ్యాన్స్ ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. 
 
34 ఏళ్ల బోల్ట్ ఒలింపిక్స్ క్రీడ‌ల్లో 8 స్వ‌ర్ణాల‌ను సాధించాడు. 2008, 2012, 2016 క్రీడ‌ల్లో గోల్డ్ మెడ‌ల్స్ గెలిచాడు. 2017లో రిటైర్ అయిన స్టార్ అథ్లెట్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన‌డం లేదు. ఫాస్టెస్ట్ మ్యాన్‌గా చ‌రిత్ర‌లో స్థానం సంపాదించిన బోల్ట్‌.. 100, 200 మీట‌ర్ల ఈవెంట్‌లో వ‌రుస‌గా మూడు ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణాలు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments