Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు పసిడి ఆశలు ఆవిరి: తై జు చేతిలో ఓటమి-కాంస్య పతకంపై దృష్టి

Webdunia
శనివారం, 31 జులై 2021 (17:09 IST)
pv sindhu
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పరాజయం పాలైన భారత షట్లర్ సింధు కాంస్య పతకంపై దృష్టిసారించింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ తై జుతో హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో సింధు వరుస సెట్లలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తై జు దూకుడు ముందు నిలవలేకపోయింది. ఫలితంగా 18-21, 12-21తో ఓటమి పాలైంది.
 
సింధు ఓడినప్పటికీ పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి. చైనాకే చెందిన హి బింగ్జియావోతో రేపు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కాంస్యం కోసం పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ఒలింపిక్స్‌లో మరో పతకాన్ని ముద్దాడినట్టే.
 
మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఆపై మరింత పట్టుదలగా ఆడిన తై జు రెండో గేమ్‌లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు.
 
దీంతో సింధు గోల్డ్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే బ్రాంజ్ మెడల్ కోసం ఆమె రేపు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన సింధు టోక్యోలో మాత్రం కాంస్య పతకం కోసం పోటీపడనుంది.

ఇకపోతే... ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడిన 18 మ్యాచ్‌లలో, తైజు-యింగ్ సింధుపై 13-5 ఆధిక్యంలో ఉన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, "నేను సంతోషంగా ఉన్నాను కానీ నేను తదుపరి మ్యాచ్ కోసం సిద్ధం కావాలి" అని చెప్పింది. తన కోచ్ మద్దతుతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం అవుతున్నానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments