Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు... కానీ జనవరి లోపు దిగుతా: సానియా

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:58 IST)
తన కెరీర్‌‌లో ఇప్పటికే చాలా సాధించానని, పునరాగమనంలో నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని ఇండియా ఏస్‌‌ టెన్నిస్ ప్లేయర్‌‌ సానియా మీర్జా తెలిపింది. బాబుకు జన్మనిచ్చాక రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సానియా.. పునరాగమనంలో సాధించేదంతా బోనస్‌‌ అని వ్యాఖ్యానించింది.

వచ్చే జనవరిలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఈ హైదరాబాదీ ప్లేయర్‌‌.. ప్రెగ్నెన్సీ కారణంగా పెరిగిన  26 కిలోల బరువు తగ్గించుకుంది. అలాగే రోజుకు నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తోంది. ‘కలగన్నవన్నీ నా కెరీర్‌‌లో సాధించా. రీ ఎంట్రీ తర్వాత దక్కబోయేది బోనస్‌‌గా భావిస్తున్నా. నిజానికి ఈ నెలలోనే కోర్టులోకి అడుగుపెట్టాలని అనుకున్నా కానీ కుదర్లేదు.

జనవరిలోపు బరిలోకి దిగుతానన్న నమ్మకం ఉంది. ఇజాన్‌‌ మాలిక్‌‌ మీర్జా (కొడుకు)కు జన్మనివ్వడం  దేవుడిచ్చిన గొప్ప వరం. నేను ఫిట్‌‌గా మారడంలో తను ఇన్స్‌‌పిరేషన్‌‌గా నిలిచాడు. పునరాగమనంలో సత్తాచాటితే బాగుంటుంది. అయితే, నన్ను నేను నిరూపించుకునేందుకు బరిలోకి దిగడం లేదు. ఆటపై  ప్రేమకొద్దే మళ్లీ టెన్నిస్‌‌ కోర్టులోకి రావాలనుకుంటున్నా.

సత్తాచాటితే మాత్రం వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌‌ గురించి తప్పకుండా ఆలోచిస్తా.  బిడ్మకు జన్మనిచ్చాక టెన్నిస్‌‌లో సత్తాచాటుతున్న అమెరికా లెజెండరీ ప్లేయర్‌‌ సెరెనా విలియమ్స్‌‌ నాకు స్పూర్తి’ అని సానియా చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments