Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IHATEMYTEACHER : ఐ హేట్ మై టీచర్ అంటున్న పీవీ సింధు (Video)

భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు నిర్మాతగా మారిపోయారు. ప్రతియేటా సెప్టెంబరు ఐదో తేదీన నిర్వహిచే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని తన బ్యాడ్మింటన్‌ గురువు పుల్లెల గోపీచంద్‌పై లఘుచిత్రం నిర్మించింది.

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:41 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు నిర్మాతగా మారిపోయారు. ప్రతియేటా సెప్టెంబరు ఐదో తేదీన నిర్వహిచే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని తన బ్యాడ్మింటన్‌ గురువు పుల్లెల గోపీచంద్‌పై లఘుచిత్రం నిర్మించింది. ఈ చిత్రంలో సింధు స్వయంగా నటించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చిన గోపీచంద్‌కు ఈ విధంగా గురుదక్షిణ చెల్లించింది. 
 
"#IHATEMYTEACHER" పేరుతో ఉన్న లఘు చిత్రంలో గోపీచంద్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో క్లుప్తంగా వివరించింది. 'కోచ్‌ నిర్విరామంగా కష్టపడుతుంటారు. నా కోసం కలలు కంటారు. నాలో ఆత్మవిశ్వాసం నింపుతారు. నన్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఆయనకు నేనిస్తున్న చిన్న కానుకే ఇది. ఈ గురుపూజోత్సవం నాడు నా విజయాన్నంతా ఆయనకు అంకితమిస్తున్నా.
 
మీ జీవితాల్లో మార్పు తెచ్చి విజయాల బాట పట్టించిన ప్రతి ఒక్కర్నీ గౌరవించాల్సిందిగా కోరుతున్నా. మనపై మనం ఉంచే విశ్వాసం కన్నా వారు మనపై ఉంచే నమ్మకమే ఎక్కువ' అని సింధు తెలిపింది. గోపీచంద్‌ శిక్షణలో పీవీ సింధు రియో ఒలింపిక్స్‌, ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?

విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!

అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

Battula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ (video)

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

Sonu Nigam: ఆస్పత్రిలో చేరిన సోనూ నిగమ్.. ఏమైందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments