Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం డ్రగ్స్ తీసుకోలేదు.. మా భోజనంలో ఎవరో కలిపారు : నర్సింగ్ యాదవ్

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తోసిపుచ్చారు. రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొనే అరుదైన అవకాశాన్ని ఈ యవ రెజ్లర్ దక్కించుకున్న విషయం తెల్సిందే

Webdunia
సోమవారం, 25 జులై 2016 (16:03 IST)
తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తోసిపుచ్చారు. రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొనే అరుదైన అవకాశాన్ని ఈ యవ రెజ్లర్ దక్కించుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ వాదిస్తున్నారు. 
 
దీనిపై నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అలాగే, సందీప్ స్పందిస్తూ... భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందేహం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments