Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పనిచేస్తే.. పీవీ సింధుకు నెం.1 ర్యాంక్ ఖాయం: ప్రకాశ్ పదుకునే

హైదరాబాదీ స్టార్ ప్లేయర్, బ్యాడ్మింటన్ తెలుగు తేజం షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు ప్రస్తుతం సెలెబ్రిటీల సరసన చేరిపోయింది. క్రీడల్లో రాణిస్

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:52 IST)
హైదరాబాదీ స్టార్ ప్లేయర్, బ్యాడ్మింటన్ తెలుగు తేజం షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు ప్రస్తుతం సెలెబ్రిటీల సరసన చేరిపోయింది. క్రీడల్లో రాణిస్తూ, ఎండార్స్‌మెంట్లు, ఫ్యాషన్ వైపు అమ్మడు బాగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మ‌హిళల సింగిల్స్‌లో  పీవీ సింధు నంబర్ వ‌న్ ర్యాంకు సాధిస్తుంద‌ని భార‌త బ్యాడ్మింట‌న్ దిగ్గ‌జం ప్ర‌కాశ్ ప‌దుకొనే జోస్యం చెప్పారు. 
 
పీవీ సింధుకు సరైన శిక్షణ ఇస్తే మాత్రం తప్పకుండా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ప్రకాశ్ పదుకునే స్పష్టం చేసారు. స‌రైన శిక్ష‌ణ‌, స‌రైన షెడ్యూల్‌, టోర్నీల మ‌ధ్య విశ్రాంతి తీసుకుంటూ.. నిలకడగా రాణిస్తూ ముందుకెళ్తే మాత్రం తప్పకుండా సింధుకు టాప్-1 ర్యాంకు ఖాయమన్నారు. 
 
ఈ విష‌యం ఆమెతోపాటు కోచ్ గోపీచంద్‌కు కూడా బాగా తెలుస‌ని ప్రరాశ్ పదుకునే తెలిపారు. మ‌రో ఐదారేళ్ల‌పాటు మెరుగైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించే సత్తా ఆమెకు ఉంద‌ని ప్ర‌కాశ్ అన్నారు. అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్ల‌ను ఓడించిన సింధు అదే ఆట‌తీరును మున్ముందు క‌న‌బ‌రుస్తుందా? లేదా? అనేదే ప్రస్తుతమున్న ప్ర‌శ్న అని పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments