Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెంబర్ 1: సానియాలా సైనా నెహ్వాల్‌కు గుర్తింపు ఇవ్వాలి!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (16:01 IST)
బ్యాడ్మింటన్ స్టార్ వరల్డ్ నెంబర్‌ వన్‌గా అవతరించిన హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్‌ను రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభినందించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో టాప్ ర్యాంకు సాధించిన మొదటి భారతీయురాలు సైనా అని కితాబిచ్చారు. ఇప్పుడామె ఘనతపరంగా ఎవరికీ తక్కువ కాదని, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఇచ్చిన గౌరవమే సైనాకూ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడార్‌గా నియమించిన విధంగానే, సైనాకు కూడా గుర్తింపునివ్వాలని అన్నారు. 
 
కాగా,  హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన సంగతి తెలిసిందే. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ర్యాంక్‌ను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. 
 
దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే (1980) తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నది సైనానే కావడం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన 25 ఏళ్ల సైనా అంతర్జాతీయ స్థాయిలో 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments