Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ వద్దు.. విమల్ కుమారే ముద్దు: సైనా నెహ్వాల్

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (11:08 IST)
గోపీచంద్-సైనా నెహ్వాల్... నిన్నమొన్నటి వరకు గురుశిష్య బంధానికి ప్రతీకలుగా నిలిచారు. గోపీ శిష్యరికంలో సైనా ఎన్నో టైటిళ్ళు నెగ్గింది. ఇటీవల కాలంలో ఫామ్ లేమి, ఫిట్ నెస్ సమస్యలు సైనాను పునరాలోచనలో పడేశాయి. 
 
ఇప్పుడామె గోపీచంద్ శిక్షణ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఆసియా క్రీడలు సమీపిస్తున్న నేపథ్యంలో.... హైదరాబాదు నుంచి బెంగళూరు మకాం మార్చి భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద శిష్యరికం చేయాలని తలపోస్తోంది.
 
గత కొంతకాలంగా సైనాకు చైనా క్రీడాకారిణుల చేతిలో పరాజయాలు తప్పడంలేదు. ప్రపంచస్థాయి టోర్నీల్లో కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేయడం రివాజుగా మారింది. 
 
గతవారం డెన్మార్క్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ సందర్భంగా సైనా తన నిర్ణయాన్ని గోపీచంద్‌కు తెలుపగా, అందుకు ఆయన 'గో ఎహెడ్' అంటూ ప్రోత్సహించారట కూడా. దీనిపై సైనా మాట్లాడుతూ, "అవును, బెంగళూరు వెళుతున్నాను. ఉబర్ కప్ సందర్భంగా విమల్ సర్ ఇచ్చిన సలహాలు ఎంతో లాభించాయి. అందుకే, ఆయన వద్ద శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను ఆసియా క్రీడల తర్వాత హైదరాబాద్ కు వచ్చేస్తాను. ఈ విషయం గోపీ సర్ కు కూడా చెప్పాను, ఆయన ఓకే చెప్పారు" అని వివరించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments