Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనాకు కేంద్రం రూ. 9 లక్షలు ఆర్థిక సాయం... ఫిజియోథెరపిస్ట్‌ నియామకం...

Webdunia
బుధవారం, 24 జూన్ 2015 (14:48 IST)
2016 రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునే నిమిత్తం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమెకు మంజూరు చేసింది. ఈ మొత్తం ఫిజియోథెరపిస్ట్‌కు నెలకు రూ.60 వేల చొప్పున  జూన్ నెల నుంచి 15 నెలల కాలానికి సరిపడే విధంగా ఈ నగదు మొత్తాన్ని కేటాయించారు. 
 
కేంద్ర ప్రభుత్వం నగదు సహాయం చేసినప్పటికినీ ఫిజియోథెరపిస్ట్‌గా ఎవరిని నియమించుకోవాలన్నది సైనా నిర్ణయానికే వదిలిపెట్టినట్టు క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. తనకు ఆర్థిక సహాయం చేసినందుకు సైనా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments