Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఒక్కటికానున్న సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (09:00 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌లు మళ్లీ ఒక్కటికానున్నారు. ఇటీవల తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్టు ఆమె ప్రకటించారు. 35 యేళ్ల సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కశ్యప్‍తో కలిసివున్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ కొన్నిసార్లు దూరం, సాన్నిహిత్యం విలువను నేర్పుతుంది. మేను ఇపుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాం అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వారి అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది. 
 
తన భర్త కశ్యప్‌తో విడిపోతున్నట్టు సైనా నెహ్వాల్ గత నెలలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట ఆరు సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. కొన్నిసార్లు జీవితం మమల్ని వేర్వేరు దిశల్లో నడిపిస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని సైనా గతంలో తన ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ హైదరాబాద్ నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో తమ బ్యాడ్మింటన్ క్రీడా కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments