Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా బ్యాడ్మింటన్: సైనా బాటలోనే సింధు.. క్వార్టర్స్‌తోనే ఓవర్!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (18:45 IST)
చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. వరల్డ్ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకోగా, భారత ఆశాకిరణం పీవీ సింధు కూడా సైనా బాటలోనే పయనించింది. ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో సైనా విఫలమైన చందంగానే.. పీవీ సింధు కూడా ప్రత్యర్థి చేతిలో సింగిల్స్ క్వార్టర్స్‌లో పరాజయం మూటగట్టుకుంది. 
 
ఆసియా బ్యాడ్నింటన్ టోర్నీ టాప్ సీడ్, ఒలింపిక్ చాంప్ లి జురుయ్ చేతిలో సింధు 21-11, 19-21, 8-21తో ఓటమిపాలైంది. చివరి రెండు గేముల్లో లి జురుయ్ ధాటికి సింధు నిలవలేకపోయింది. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడంతో చైనా అమ్మాయిలు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. దీంతో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్తాచాటుకోలేకపోతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments