Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్ నాకు ఫ్రెండ్ కాదు.. బాయ్‌ ఫ్రెండ్ అస్సల్లేదు!

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (13:31 IST)
భారత బ్యాడ్మింటన్ రంగంలో ఆశాకిరణం, తెలుగుతేజం పుసర్ల వెంకట సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ తనకు స్నేహితురాలేమీ కాదని, 'హలో' అంటే 'హలో' అనుకుంటామని, తమ స్నేహం అంతవరకేనని స్పష్టం చేసింది.
 
హైదరాబాదుకే చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి తనకు మంచి మిత్రురాలని సింధు తెలిపింది. ఏ విషయమైనా ఆమెతో పంచుకుంటానని చెప్పింది. ఇక, ప్రేమ విషయానికొస్తూ, తనకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరని, నేటి వరకు ప్రేమలో పడలేదని తెలిపింది.
 
కాగా, సింధు బ్యాడ్మింటన్ కారణంగా సొంత అక్క పెళ్ళిని కూడా మిస్సయిందట. అక్క వివాహం సమయానికి తాను లక్నో గ్రాండ్ ప్రీ టోర్నీలో పాల్గొనాల్సి వచ్చిందని ఈ పొడగరి వివరించింది.
 
అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులే. తండ్రి వెంకటరమణ, తల్లి విజయ ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. వెంకటరమణకు 2000లో అర్జున అవార్డు కూడా లభించింది. తల్లిదండ్రుల బాటలో కాకుండా సింధు బ్యాడ్మింటన్ ఎంచుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments