Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేసియా మాస్టర్స్‌‌లో అదరగొట్టిన సైనా నెహ్వాల్.. సింగిల్స్.. డబుల్స్‌లోనూ భారత్ హవా

అంతర్జాతీయ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారాంభం చేసింది. ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో సైనా అదుర్స్ అనిపించారు. మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ ట

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (14:46 IST)
అంతర్జాతీయ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారాంభం చేసింది. ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో సైనా అదుర్స్ అనిపించారు. మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సైనా 21–9, 21–8తో చాసిని కొరెపాప్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. 
 
కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సైనాకు గట్టిపోటీ ఎదురుకాలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో సైనా తలపడుతుంది. 
 
ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అజయ్‌ జయరామ్‌ (భారత్‌) ఒకే రోజు రెండు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో జయరామ్‌ 21–10, 17–21, 21–14తో క్వాలిఫయర్‌ జున్‌ హావో లియోంగ్‌ (మలేసియా)పై, రెండో రౌండ్‌లో 21–9, 21–12తో సపుత్ర విక్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు.
 
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 15–21, 21–13, 21–18తో జియా హువో చెన్‌–చున్‌ కాంగ్‌ షియా (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments