Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సర్ సరితా దేవికి సచిన్ సపోర్ట్ : కేంద్రానికి లేఖ!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (10:35 IST)
నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవికి మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్‌ బాసటగా నిలిచారు. ఆసియా క్రీడల్లో పతకం నిరాకరించి సస్పెన్షన్ వేటుకు గురైన ఆమెకు కేంద్రం మద్దతివ్వాలంటూ లేఖ రాశాడు. 
 
క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సర్బానంద సోనోవాల్‌కు రాసిన లేఖలో, సరితా దేవి ఇప్పటికే క్షమాపణ చెప్పిందని, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలని సచిన్ లేఖలో విజ్ఞప్తి చేశాడు. సరితాదేవికి పూర్తి మద్దతు ఇవ్వాలని, కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి నుంచి కాపాడాలని సచిన్ కోరాడు. 
 
కాగా, ఆసియా క్రీడల బాక్సింగ్‌లో ఓ బౌట్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ సరితా దేవి కాంస్య పతకం నిరాకరించడంతో ఆమెపై బాక్సింగ్ ఇండియా సంఘం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments