Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డెన్ టోర్నీ ముగియలేదు.. కానీ, విజేతగా రోజర్ ఫెదరర్... ఎలా?

ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. తొలి రౌండ్ పోటీలు పూర్తికాకముందే ఈ పోటీలు అమితాసక్తితో జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీ పూర్తికాకముందే టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్‌ను అవతరించాడు. అ

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (14:08 IST)
ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. తొలి రౌండ్ పోటీలు పూర్తికాకముందే ఈ పోటీలు అమితాసక్తితో జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీ పూర్తికాకముందే టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్‌ను అవతరించాడు. అదీకూడా తన ప్రత్యర్థిపై 6-0, 6-0, 6-1 స్కోరుతో విజేతగా నిలిచాడట. అయితే, ఇక్కడో తప్పు జరిగింది. నెట్టింట్లో సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు సెర్చ్ చేసే వికీపీడియాలో తప్పుగా సమాచారాన్ని ఫీడ్ చేశారు. 
 
ఈ టోర్నీలో ఫెద‌ర‌ర్ గెలిచేశాడ‌ని, అత‌నికి కెరీర్‌లో ఇది 8వ వింబుల్డ‌న్ టైటిల్ అని అత‌ని పేరిట ఉన్న వికీపీడియా చూపించ‌డంతో చాలా మంది షాక్ తిన్నారు. అంతేకాదు ఫైన‌ల్లో ఫెద‌ర‌ర్ 6-0, 6-0, 6-1తో నాద‌ల్‌పై గెలిచాడ‌ని స్కోరు, ప్ర‌త్య‌ర్థిని కూడా ఇవ్వ‌డం విశేషం. అయితే త‌ప్పు తెలుసుకొని దీనిని డిలీట్ చేసేలోగా.. అప్ప‌టికే చాలా మంది స్క్రీన్‌షాట్లు తీసుకొని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైర‌ల్ అయింది. 
 
కాగా, ప్ర‌స్తుతం టోర్నీలో ఫెద‌ర‌ర్ ప్రిక్వార్ట‌ర్స్ మాత్ర‌మే చేరాడు. మూడో రౌండ్‌లో 7-6, 6-4, 6-4 స్కోరుతో జ‌ర్మ‌నీకి చెందిన మిషా జ్వెరెవ్‌పై గెలిచి నాలుగో రౌండ్ చేరాడు ఫెడెక్స్‌. ప్రిక్వార్ట‌ర్స్‌లో అత‌డు బ‌ల్గేరియాకు చెందిన 13వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్‌తో పోటీ ప‌డనున్నాడు. వికీపీడియా లేనిపోని స‌మాచారాన్నంతా ముందే పెట్టేసినా.. అదే నిజ‌మై కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల‌వాల‌ని ఫెద‌ర‌ర్ అభిమానులు కోరుకుంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments