Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో 2016: భారత ఆటగాళ్ళ పేలవ ప్రదర్శన.. నిన్న లియాండర్ పేస్.. నేడు సానియా జోడీ నిష్క్రమణ

అట్టహాసంగా ప్రారంభమైన విశ్వక్రీడా పోటీలైన రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ళ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రస్థానం తొలి రోజునే ముగిసిన విషయం తెల్సిందే. రెండో

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (13:59 IST)
అట్టహాసంగా ప్రారంభమైన విశ్వక్రీడా పోటీలైన రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ళ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రస్థానం తొలి రోజునే ముగిసిన విషయం తెల్సిందే. రెండో రోజైన ఆదివారం మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా జోడీ నిష్క్రమించింది.
 
భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్లో సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ జంట 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జోడి షాయి జంగ్-షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. 
 
ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్డ్ డబుల్స్పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో సానియా-రోహన్ బోపన్నలు జోడి కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్లో పరాజయం ఎదుర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన సానియా-రోహన్ బోపన్నలు మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్నారు.
 
ఇక్కడ విచిత్రమేమిటంటే.. లియాండర్ పేస్.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగారు. 1996 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పేస్‌ మరో పతక కల ఈసారీ కలగానే మిగిలిపోయింది. ఒలింపిక్‌ బెర్తు దగ్గర నుంచి క్రీడా గ్రామంలో గది పంచుకునే విషయం వరకూ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పేస్‌-రోహన్‌ బోపన్న ద్వయం తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ మొదటి రౌండ్‌లోనే ఓడి అత్యంత అవమానకర రీతిలో రియో నుంచి నిష్క్రమించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

తర్వాతి కథనం
Show comments