Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లెల గోపిచంద్‌ రియల్‌ హీరో : సచిన్‌ టెండూల్కర్, సింధు - సాక్షి - దీపాలకు కార్లు బహుకరణ

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపిచంద్‌‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుల్లెల గోపీచంద్ 'రియల్‌ హీరో' అంటూ కీర్తించాడు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (11:07 IST)
బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపిచంద్‌‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుల్లెల గోపీచంద్ 'రియల్‌ హీరో' అంటూ కీర్తించాడు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్‌ అకాడమీలో సచిన్‌ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్‌ అకాడమీకి చేరుకున్న సచిన్‌.. పీవీ సింధు, సాక్షిమాలిక్‌, దీపా కర్మాకర్‌‌లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్‌ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్‌ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్‌ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్‌ సింధు, గోపిచంద్‌, సాక్షిమాలిక్‌, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు.
 
అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే రాణించి, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించగలరన్నారు. వీరిని చూసి భారత్‌ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మున్ముందు వీరంతా మరింతగా రాణిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్‌ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Madhavi Latha: మాధవి లతపై తాడిపత్రిలో కేసు.. కమలమ్మ ఎవరు?

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments