Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధుడిని అవమానించిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. నెటిజన్ల ఫైర్

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో బుద్ధుడిని ఘోరంగా అవమానించాడు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలు పెట్టి ఫొటోకు పోజిచ్చాడు. అనంతరం ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు. దానిని చూసి

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (12:18 IST)
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో బుద్ధుడిని ఘోరంగా అవమానించాడు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలు పెట్టి ఫొటోకు పోజిచ్చాడు. అనంతరం ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు. దానిని చూసిన నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలుపెట్టి క్రిస్టియానో తన అహంకారాన్ని చాటుకున్నాడని బుద్ధిస్టులు మండిపడుతున్నారు. 
 
బుద్ధుడిని అవమాన పరిచాడంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ''క్రిస్టియానో నేను నీ అభిమానిని. నువ్వు బుద్ధుడిని గౌరవించడం నేర్చుకోవాలి. నువ్వు క్రిస్టియన్‌వా, ముస్లింవా, హిందువా? అన్నది తర్వాత. నీకు అన్ని మతాలకు చెందిన అభిమానులు ఉన్నారు. 
 
నువ్వు ఇలా చేయడం సరికాదు. నేనైతే నిన్ను క్షమిస్తా, కానీ నీ పని వల్ల మా(బుద్ధిస్టుల) మనసులు గాయపడ్డాయి'' అని పేర్కొన్నాడు. ''నీ చర్యతో ఓ అభిమానిని కోల్పోయావు'' అని ఇంకో అభిమాని పేర్కొన్నాడు. ఫొటో పోస్టు అయిన 9 గంటల్లో 1.4 మిలియన్ల లైకులు రాగా 9,40,381 మంది స్పందించారు. వీరిలో 47,677 మంది రొనాల్డ్‌ను తిట్టిపోశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments