Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు పీవీ సింధు : శంషాబాద్‌లో ఘన స్వాగతం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:55 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు బుధవారం తన సొంతగడ్డ హైదరాబాద్‌కు వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 
 
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్‌, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక సింధు తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు.
 
ఆ తర్వాత విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామన్నారు. 
 
అలాగే, పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒలింపిక్స్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments