Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెప్సికో స్పోర్ట్స్ డ్రింక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు.. డీల్ కుదిరింది

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇకపై పెప్సికో సంస్థకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్స్ గేటొరేడ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ కంపెనీతో డీల్ కుదిరింది. ట్రైనింగ్ సమయంలో ఆటగాళ్ల న్యూట్రీషన్ గురించి

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (09:54 IST)
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇకపై పెప్సికో సంస్థకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్స్ గేటొరేడ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ కంపెనీతో డీల్ కుదిరింది. ట్రైనింగ్ సమయంలో ఆటగాళ్ల న్యూట్రీషన్ గురించి అవగాహన పెంచుకునేందుకు గేటొరేడ్ స్పోర్స్ట్ సింధుతో కలిసి పనిచేయనుంది.

పెప్సికో కుటుంబంలోకి సింధును ఆహ్వానిస్తుమని, గేటొరేడ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ సింధు సరైన వ్యక్తిగా భావిస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు.  
 
భారత్‌లో 2004లో ప్రారంభమైన గేటొరేడ్ డ్రింక్‌కు జమైకా చిరుత ఉసేన్‌బోల్ట్‌, లియోనెల్‌ మెస్సీ, సెరెనా విలియమ్స్‌, జేమ్స్‌ రోడ్రిగెజ్‌ వంటి ఆటగాళ్లతో పెప్సీ సంస్థం ఒప్పందం కుదుర్చుకుంది. టీమిండియాతోపాటు పలు టీమ్‌లకు అధికారిక స్పోర్ట్స్‌ డ్రింక్‌గా వ్యవహరిస్తోంది. ప్రపంచంలోని క్రీడా దిగ్గజాలతో కూడిన గేటొరేడ్‌లో భాగస్వామి కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సింధు వ్యాఖ్యానించింది. 
 
ఇదిలా ఉంటే.. మొన్నటిదాకా వర్ధమాన షట్లర్గానే ఉన్న పీవీ సింధు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సన్మానాలు చేశారు. ఉద్యోగాలు ప్రకటించారు. రియోలో రజతపతకం సాధించాక ఈ తెలుగుతేజం కెరీర్ మారిపోయింది. సింధు బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments