Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్ ఓపెన్ ఫైనల్‌లోకి పీవీ సింధు.. అది జరిగితే..?

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:08 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ చేరుకుంది. జపాన్‌ అమ్మాయి సయినా కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది. 
 
తక్కువ ర్యాంకు ప్రత్యర్థిని కేవలం 31 నిమిషాల్లోనే ఇంటికి పంపించేసింది. స్వర్ణం సాధిస్తే 2022లో సింధు ఖాతాలో తొలి సూపర్‌ 500 టైటిల్‌ పడుతుంది.
 
కవాకమినితో పోరుకు సింధు మల్లగుల్లాలు పడింది. వీరిద్దరూ గతంలో తలపడిన రెండు మ్యాచుల్లోనూ తెలుగు తేజానిదే పైచేయి. సెమీస్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది. 
 
వరుస స్మాష్‌లతో చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో కవాకమి తేలిపోయింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడంతో 0-5తో వెనకబడింది.
 
సింధు అదే పనిగా ర్యాలీలు ఆడించి ప్రత్యర్థిని దెబ్బతీసింది. తప్పులు చేసేలా ఉసిగొల్పింది. 11-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించి 17-5తో విజయానికి చేరువైంది. 21-7తో గేమ్‌తో పాటు మ్యాచునూ ముగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments