Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బాగానే ఉన్నా.. అవన్నీ వదంతులే : ఫుట్‌బాల్ దిగ్గజం పీలే!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (10:10 IST)
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం 74 యేళ్ల పీలే కొట్టిపారేశాడు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న పీలే తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. 
 
సావుపాలోలోని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో నేను చికిత్స పొందుతున్నా. వ్యక్తిగత కారణంగా నేను ఆసుపత్రిలోని ఓ ప్రత్యేక రూంలో ఉంటున్నా. నన్ను చూడటానికి వస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. అభిమానుల అండతో నేను వ్యాధి నుంచి త్వరలోనే కోలుకుంటా. నేను ప్రశాంత వాతావరణంలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా. 
 
మీ ప్రేమాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. రాబోయే కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నా. డిశ్చార్జీ అనంతరం దీనిని అమలుపరుస్తానని పీలే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments