Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పారిస్ ఒలింపిక్స్ పోటీలు... అగ్రస్థానంలో అమెరికా

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:42 IST)
పారిస్ వేదికగా జరిగిన విశ్వక్రీడలు (పారిస్ ఒలింపిక్స్) అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ క్రీడా పోటీల్లో అగ్రరాజ్యం అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. 
 
అయితే, బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా చివరి సారిగా 2008 ఒలింపిక్స్‌లో అమెరికాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అప్పట్లో చైనాకు 48 బంగారు పతకాలు వచ్చాయి. ఈసారి ఈ క్రీడల్లో బంగారు పతకాల పరంగా చైనా తొలుత ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అమెరికా చైనా రికార్డును సమం చేసింది. బాస్కెట్బాల్ డబుల్స్ పోటీలో అమెరికా మహిళల టీం ఫ్రాన్స్‌పై 67-66తో గెలిచి బంగారు పతకం ఎగరేసుకుపోయింది. 
 
ఈ ఒలింపిక్స్ చైనా.. డైవింగ్, స్విమ్మింగ్ లాంటి పూల్ ఈవెంట్స్‌తో పాటు టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగులో ఆధిపత్యం కనబరిచింది. అమెరికా మాత్రం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో పైచేయి సాధించి మొత్తం 14 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలను ఎగరేసుకుపోయింది. పూల్ ఈవెంట్స్‌లో కూడా అమెరికా సత్తా చాటింది. 8 బంగారు పతకాలు సహా మొత్తం 28 మెడల్స్ సొంతం చేసుకుంది.
 
ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్య, ఒక వెండి పతకాన్ని వేసుకుంది. అయితే, అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు అప్పీలు చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత 44 ఏళ్లల్లో తొలిసారిగా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ 62వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్ జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్లు వరుసగా మూడు, నాలుగు, ఐదు, స్థానాల్లో నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments