Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగ్నమ్ స్టైల్: ఆసియా క్రీడల స్టేజ్‌పై హోరెత్తనుంది!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:13 IST)
రెండేళ్ల కిందట విచిత్రమైన శైలితో ప్రపంచాన్ని ఊపేసిన ‘గంగ్నమ్ స్టైల్’ ఇప్పుడు ఆసియా క్రీడల వేదిక ఇంచియాన్‌లో హోరెత్తుతోంది. పోటీలకు హాజరవుతున్న వివిధ దేశాల అథ్లెట్లకు దక్షిణ కొరియా ఈ శైలిలో ఘనంగా స్వాగతం పలుకుతోంది. 
 
మరోవైపు క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 62 వేల సామర్థ్యం కలిగిన ఇంచియాన్ ఏషియాడ్ స్టేడియం కిక్కిరిసిపోనుంది. కొరియన్ల గుర్తులు, సంస్కృతి సంప్రదాయాలతోపాటు భవిష్యత్‌ను డిజిటల్ టెక్నాలజీలో చూపించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు గేమ్స్ జాయింట్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్న కొరియా సినిమా దర్శకులు ఇమ్ వోన్ టియాక్, జాంగ్ జిన్‌లు తెలిపారు. ‘ఆసియా ఒక్కటే’ పేరుతో రూపొందించిన థీమ్ సాంగ్‌లో 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 
 
45 దేశాలు, 4.5 బిలియన్ ప్రజల ఆకాంక్ష ‘ఒకే ఆసియా’ అంటూ ఓ మెసేజ్‌ను ప్రపంచానికి పంపనున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments