Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు అలిగిందని ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదే ప్రేమికుల్లో ప్రియుడో.. ప్రియురాలో దూరమైతే మాత్రం తట్టుకోలేరు. తిరిగి దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:58 IST)
కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదే ప్రేమికుల్లో ప్రియుడో.. ప్రియురాలో దూరమైతే మాత్రం తట్టుకోలేరు. తిరిగి దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
మహారాష్ట్రలోని పింపరీ చించవఢ్‌ ప్రాంతానికి చెందిన నిలేశ్‌ ఖేడికర్‌ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని అమితంగా ఇష్టపడింది. అయితే, వారిద్దరి మధ్యా అనుకోకుండా చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ప్రియురాలు అతనికి దూరమైంది. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న ప్రియుడు... వినూత్నంగా క్షమాణ చెప్పి ప్రేయసి కోపాన్ని తగ్గించాలని భావించాడు. 
 
అనుకున్నదే తడవుగా.. పిపరీ చించవఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి రూ.72 వేలు ఖర్చు చేసి తన స్నేహితుడి సాయంతో రోడ్డు పొడవున ఏకంగా 300 హోర్డింగులు పెట్టాడు. ఈ హోర్డింగ్‌లలో 'నన్ను క్షమించు.. నన్ను క్షమించు'.. అంటూ తన ప్రియురాలు ప్రయాణించే మార్గంలో 300 హోర్డింగులు కట్టాడు. వీటిని చూసిన ఆ ప్రియురాలు.. తన ప్రియుడి చర్యకు ఫిదా అయిపోయి అతన్ని క్షమించేసింది. 
 
అయితే వాటిలో కొన్నింటికి అనుమతి లేదంటూ కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఖేడికర్‌తో పాటు అతని స్నేహితుడని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల చర్యతో హోర్డింగుల్లో ప్రియురాలిని క్షమాపణలు వేడుకున్న నిలేశ్‌ ఇప్పుడు అవే క్షమాపణలు నేరుగా పోలీసులనే వేడుకోవలసి వస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments