Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకిచ్చిన మెస్సీ.. బార్సిలోనా క్లబ్‌‌కు గుడ్ బై చెప్పేశాడు.. కారణం అదేనా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (14:41 IST)
Messi
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోర పరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
లీగ్ క్వార్టర్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని బార్సీలోనా జట్టు 2-8తో బేర్న్ మునిచ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది మెస్సీ కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాజయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా 2007-08 సీజన్‌ నుంచి టైటిల్స్ గెలుస్తున్న ఆ జట్టుకు ఇది ఘోరపరాభావం. బార్సిలోనా క్లబ్‌కు మెస్సీ పంపిన పత్రం సీజన్ ముగింపులో క్లబ్ వీడొచ్చనే నిబంధనను పేర్కొన్నాడు. 
 
అయితే ఆ రూల్ గడువు జూన్‌లోనే ముగిసిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని క్లబ్ ప్రకటించింది. బార్సిలోనా క్లబ్‌కు చెందిన మాసియా యూత్ అకాడమీలో 2001లో చెరిన మెస్సీ.. 2003లో 16 ఏళ్ల వయసులో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. లియోనల్‌ మెస్సీ.. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments