Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయ్ పాలక మండలి సభ్యురాలిగా గుత్తా జ్వాల.. ఖుషీ ఖుషీగా ఢిల్లీకి..

2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (17:51 IST)
2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) పాలక మండలి సభ్యురాలిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల నియమితురాలయ్యారు. 
 
దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం గుత్తా జ్వాలను ఎస్ఏఐ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు సాయ్ కార్యదర్శి ఎస్.ఎస్ ఛాబ్రా తెలిపారు. డబుల్స్ విభాగంలో 14సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన జ్వాలకు ఈ గౌరవం దక్కడం హర్షనీయమని ఛాబ్రా వెల్లడించారు. 
 
ఎస్ఏఐ పాలకమండలి సభ్యురాలిగా ఎంపికవడంపై జ్వాల మాట్లాడుతూ.. తనకు రెండు రోజుల క్రితం సాయ్ అధికారులు ఈ నిర్ణయాన్ని ఫోన్ ద్వారా తెలిపారన్నారు. సాయ్‌లో తన విధులు, బాధ్యతలు ఇంకా స్పష్టం కానప్పటికీ ఈ నెల 28 వ తేదీన ఢిల్లీలో ‘సాయ్‌’తో తన మొదటి సమావేశం ఉంటుందని వివరించారు. దేశంలో బ్యాడ్మింటన్‌ రంగం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments