Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా చిత్తు - థామస్ కప్ విజేతగా భారత్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:36 IST)
బ్యాంకాక్ వేదికగా జరిగిన థామస్ కప్ పైనల్ పోటీల్లో భారత్ చరిత్ర సృష్టించింది. థామస్ కప్ విజేతగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రాత్మక విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది. అద్భుత ఆటతీరుతో భారత ఆటగాళ్ళు తుదిపోరులో ఇండోనేషియాను ఊపిరి పీల్చుకోని విధంగా చేశారు. ఫలితంగా ప్రత్యర్థిపై 3-0 తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత 20 యేళ్ళ యువ ఆటగాడు లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత ఆంథోనీపై గెలుపొందారు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంతో అందించాడు. ఆ తర్వాత డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో మహ్మద్ అహసన్ - సంజయ సుకమౌల్జో‌పై గెలుపొందారు. 
 
దీంతో ఇండోనేషియాపై 2-0 ఆధిక్యంతో  భారత్ దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం. ఇక ఆఖరి గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లలో జోనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించి 30 ఆధిక్యంతో థామస్ కప్‌ను కేవసం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments