Webdunia - Bharat's app for daily news and videos

Install App

35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు: రియో గేమ్స్‌లో..

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (17:13 IST)
భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీస్‌లో 5-6 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణపోరులో భారత్‌ 1-0తో జపాన్‌పై విజయం సాధించింది. 
 
టోర్నీలో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 13వ నిమిషంలో స్ట్రయికర్‌ రాణీ రాంపాల్‌ విన్నింగ్‌ గోల్‌ చేసింది. వందనా కటారియా కొట్టిన షాట్‌ జపాన్‌ కీపర్‌కు తగిలి రీ బౌండ్‌ అయింది. అవకాశం కోసం వేచి చూస్తున్న రాణి.. ఆ బంతిని వెంటనే గోల్‌లోకి పంపి భారత్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చింది. రాణీ మ్యాచ్‌ విన్నింగ్‌ గోల్‌ చేసినా.. ఒలింపిక్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే అందుకు సవిత కీపింగే ప్రత్యేకంగా నిలిచింది. 
 
జపాన్‌కు దక్కిన ఓ అరడజను చాన్సులను సవిత నిలువరించి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయిల టీమ్‌ తొలిసారిగా ఆడింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దేశాల స్థానాలు భర్తీ అయ్యేకొద్దీ.. ఈ టోర్నీలో 5వ స్థానంలో నిలిచిన భారత్‌ రియో బెర్త్‌పై స్పష్టత వస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments