టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. సాకర్ ప్రపంచ కప్‌లో బోణి చేసింది. పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఏకంగా 4-0తో చిత్తు చేసింది. గత ప్రపంచ కప్‌లో ఐదు గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ అందుకున్న థామస్ ముల్లర్ ఈసారి తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ కొట్టి జర్మనీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జర్మనీకి పోర్చుగల్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ జట్టు డిఫెండర్లు ఘోరంగా విఫలమయ్యారు.