Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్.. నిరాశపరిచిన సానియా.. సెమీఫైనల్లోకి నాదల్

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:55 IST)
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మూడో రౌండ్‌లో సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ కు చెందిన లూసీ హడెక్కా జంట ఓడిపోయింది.
 
అమెరికాకు చెందిన కోకో గాఫ్, జెస్సికా పెగులా చేతిలో 6-4, 6-3 తేడాతో ఓడిపోయింది. సానియా, లూసీ జంట అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చినప్పటికీ ప్రత్యర్థుల ముందు తలవంచక తప్పలేదు. అనవసర తప్పిదాలతో సానియా జోడీ మ్యాచ్ ను చేజార్చుకుంది.
 
మరోవైపు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌పై గెలుపొందాడు. 
 
నాలుగు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ తనదైన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. తద్వారా తన కెరీర్లో 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. రోలాండ్ గారోస్ కోర్ట్‌లో  13సార్లు గెలుపొందాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments