Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్ : 24 ఏళ్ళ తర్వాత గట్టి ఎదురుదెబ్బ!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (11:45 IST)
ఫిఫా వరల్డ్ కప్‌లో 24 ఏళ్ళ తర్వాత సెమీస్ చేరిన అర్జెంటీనా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫార్వర్డ్ ఏంజెల్ డి మారియా తొడకండరాల గాయంతో సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బెల్జియంతో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మారియా పలుమార్లు కుడి తొడ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో, మ్యాచ్ పూర్తికాకముందే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. 
 
జట్టు వైద్యుడు డానియెల్ మార్టినెజ్ మాట్లాడుతూ, ఇది 'ఫస్ట్ డిగ్రీ' గాయం అని, తీవ్రత దృష్ట్యా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగే సెమీఫైనల్‌కు దూరంగా ఉంటాడని తెలిపారు. కాగా, ఇదే తరహా గాయంతో బాధపడిన మరో స్ట్రయికర్ సెర్గియో అగెరో ఫిట్‌గా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో, అర్జెంటీనాకు కాస్తంత ఊరట లభించింది. మారియోకు తోడు అగెరో కూడా దూరమై ఉంటే అటాకింగ్ భారమంతా సూపర్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీ ఒక్కడే మోయాల్సి వచ్చేది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments