Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎండబ్ల్యూ కారును వాపస్ ఇవ్వనున్న దీపా కర్మాకర్...మెయింటైన్ చేయలేనని..

రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్‌ను మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఘనంగా సత్కరించారు. పుల్లెల గోపీచంద్ అకాడమీకి వచ్చిన సచిన్ సింధు, సాక్షి, దీపా

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:28 IST)
రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్‌ను మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఘనంగా సత్కరించారు. పుల్లెల గోపీచంద్ అకాడమీకి వచ్చిన సచిన్ సింధు, సాక్షి, దీపాతో పాటు గోపీచంద్‌కు బీఎండబ్ల్యూ కార్లను బహుకరించిన విషయం తెలిసిందే. జిమ్నాస్టిక్స్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలకు పాత్రురాలైన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. సచిన్ బహూకరించిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారును వెనక్కి ఇచ్చేయాలని దీపా నిర్ణయించుకుంది.
 
అగర్తల వంటి నగరంలో ఉండే దీపా కుటుంబానికి బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కారును మెయింటైన్ చేయడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయంపై దీపా కోచ్ బిశేశ్వర్ నంది మాట్లాడుతూ...''ఇది దీపా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఆమె కుటుంబంతో పాటు నేనూ ఈ విషయమై ఆలోచించాను. అగర్తల సిటీలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ లేకపోవడంతో పాటు ఇక్కడి రోడ్లు కూడా అలాంటి కారు నడిపేందుకు అనుకూలం కావు" అని తెలిపారు.
 
 అలాంటి రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడిపితే పాడయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ కారణంగానే బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని ఆమె కోచ్ నంది తెలిపారు. తమ నిర్ణయాన్ని హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం వర్గాలకు తెలిపామని, వారు ఏమీ అభ్యంతరం వ్యక్తం చేయలేదని నంది వెల్లడించారు. ఒకవేళ వీలైతే కారు ధరకు సమానమైన మొత్తాన్ని దీపా బ్యాంకు ఖాతాలో జమచేయాలని కోరామని, అలాకాకున్నా, వారెంత మొత్తం ఇవ్వాలనుకున్నా తమకు సమస్యేమీ లేదని అన్నారు. 
 
రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్యం అందుకున్న సాక్షి మాలిక్‌తో పాటు దీపా కర్మాకర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లు ప్రకటించారు. వాటిని తన స్నేహితుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతులు మీదుగా హైదరాబాద్ లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో బహూకరించిన విషయం విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments