Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలంపిక్స్‌లో ఇండియన్ మహిళా జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర

భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో భాగంగా ప్రొడున

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (15:50 IST)
భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో భాగంగా ప్రొడునోవా వాల్ట్  విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. 
 
ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్‌లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ, దీపా కర్మాకర్ ఇండియాకో పతకాన్ని తీసుకురావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

తర్వాతి కథనం
Show comments