Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం.. మాదకద్రవ్యాల విక్రయం.. బెదిరింపులు.. హత్యలు.. ఇదీ రియో ఒలింపిక్స్ పరిస్థితి!

రియో ఒలింపిక్స్‌.. విశ్వ క్రీడా పోటీల కోసం అద్భుతమైన ఒలింపిక్‌ గ్రామాన్ని నిర్మించారు. కళ్ళు చెదిరిపోయే ఏర్పాట్లు చేశారు. పది వేల మందికి పైగా ప్రపంచస్థాయి క్రీడాకారులు చేసే సాహస విన్యాసాలను తిలకించేంద

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (08:48 IST)
రియో ఒలింపిక్స్‌.. విశ్వ క్రీడా పోటీల కోసం అద్భుతమైన ఒలింపిక్‌ గ్రామాన్ని నిర్మించారు. కళ్ళు చెదిరిపోయే ఏర్పాట్లు చేశారు. పది వేల మందికి పైగా ప్రపంచస్థాయి క్రీడాకారులు చేసే సాహస విన్యాసాలను తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. అదే నాణేనికి మరోవైపు.. ముక్కుపచ్చలారని చిన్నారులతో వ్యభిచారం. మాదకద్రవ్యాల వినియోగం. విక్రయం. డబ్బు కోసం బెదిరింపులు. అత్యంత క్రూరమైన హత్యలు. ఇలాంటి క్రూరమైన చర్యలు నాణేనికి రెండోవైపు. 
 
దీనికి కారణం లేకపోలేదు. బ్రెజిల్‌లో వ్యభిచారం మాత్రం చట్టబద్ధం. దీంతో సెక్స్‌వర్కర్లు ఒలింపిక్స్‌లో రెండు చేతులా సంపాదించుకోవాలని భావిస్తున్నారు. కానీ, విషాదమేంటంటే.. తొమ్మిది-పదేళ్ల పిల్లలు సైతం ఈ వ్యభిచారం రొంపిలోకి వస్తున్నారు. 2014లో అక్కడ వరల్డ్‌ సాకర్‌ పోటీలు నిర్వహించినప్పుడూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. 
 
వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఒలింపిక్‌ స్టేడియానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేదరికంతో కునారిల్లే మురికివాడల్లో ఈ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అంతేనా... ఈ మురికి వాడల్లో గన్స్‌, డ్రగ్స్‌, వయొలెన్స్‌, మర్డర్స్‌.. ఇవన్నీ సర్వసాధారణంగా భావించే ప్రపంచం అది. వివిధ ముఠాల మధ్య.. ముఠాలకు, పోలీసులకు మధ్య కాల్పులు అక్కడ సహజంగా కనిపిస్తున్నాయి. 

ఐస్‌క్రీమ్‌లో జెర్రి... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన మహిళకు షాక్!

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచన

కీలక అంశాలపై భారత్‌తో కలిసి పని చేస్తాం : కెనడా ప్రధాని ట్రూడో

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం