Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దంగల్'' బబితకు రజతం.. అమీర్ ఖాన్ తరహాలోనే క్లైమాక్స్‌లో..?

అమీర్ ఖాన్ హీరోగా నిర్మించిన ''దంగల్'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారత రెజ్లర్లు గీత, బబిత ఫోగాట్.. వారి తండ్రి మహావీర్ ఫోగాట్ జీవిత చరిత్రపై అమీర్ ఖాన్ దంగల్ సినిమాను తెరకెక్క

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (13:10 IST)
అమీర్ ఖాన్ హీరోగా నిర్మించిన ''దంగల్'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారత రెజ్లర్లు గీత, బబిత ఫోగాట్.. వారి తండ్రి మహావీర్ ఫోగాట్ జీవిత చరిత్రపై అమీర్ ఖాన్ దంగల్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో తన కుమార్తె ఫైనల్ మ్యాచ్‌ను చూడనీయకుండా మహావీర్‌ను ఓ గదిలో బంధిస్తారు. ఈ సీన్ ప్రస్తుతం రిపీట్ అయ్యింది.
 
కామన్వెల్త్ గేమ్స‌లో మహావీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె స్వర్ణపతకం సాధించిన పూర్తి మ్యాచ్‌ని వీక్షించలేక చివరి క్షణాల్లో స్టేడియం లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు స్టేడియం బయటే ఉండిపోవాల్సి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో బబిత 53 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బబిత ఫైనల్ పోరును చూసేందుకు వెళ్లిన మహావీర్ స్టేడియం బయటే ఆగిపోవాల్సి వచ్చింది. తొలి మూడు బౌట్‌లనూ ఆయన చూడలేకపోయారు. చివరకు ఆస్ట్రేలియా రెజర్లకు ఇచ్చిన ఓ టికెట్‌తో ఆయన లోపలికి వెళ్లి చివరి క్షణాలను మాత్రం చూడగలిగారు. 
 
ఈ వ్యవహారంపై అధికారులు స్పందిస్తూ, రెజ్లింగ్ కోచ్ తోమర్‌కు తాము ఐదు టికెట్లు ఇచ్చామని, వాటిల్లో ఒకటి మహావీర్‌కు ఎందుకు అందలేదో తెలియదన్నారు. ప్రతి అథ్లెట్లకు రెండు టిక్కెట్లు ఇస్తారని.. కానీ రాత్రి వరకు ప్రయత్నించినా.. తనకు టిక్కెట్లు ఇవ్వలేదని బబిత వాపోయింది. కాగా ఈ పోటీల్లో బబిత ఫోగోట్ రజతంతో సరిపెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

తర్వాతి కథనం
Show comments