Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మారడోనా మృతి.. కోలుకుంటాడనుకుంటే.. తిరిగిరాని లోకాలకు..?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (11:02 IST)
అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా(60)గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే మెదడులో రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొన్ని వారాల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 
 
కోలుకుంటున్న దశలో అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు. తన అపురూప విన్యాసాలతో ఫుట్ బాల్ క్రీడకే వన్నె తెచ్చిన అరుదైన క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా ఆటతోనే కాదు మాదకద్రవ్యాలు, ఇతర వివాదాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 
 
ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న ఈ ఫుట్ బాల్ లెజెండ్ ఇకలేరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో మారడోనాదే కీలకపాత్ర. ఇంగ్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌తో మారడోనా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 
 
గోల్ పోస్ట్ వద్ద మెరుపువేగంతో దూసుకెళ్లి, బంతిని గోల్ పోస్ట్ లోకి పంపినా, అది చేయి తగిలి గోల్ లోకి వచ్చిందని ప్రత్యర్థులు ఆరోపించగా, అది దేవుడి చేయి అయ్యుంటుందంటూ నాడు మారడోనా అందరినీ విస్మయానికి గురిచేశాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments