Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : మణిపూర్ మాణిక్యం మేరీకోమ్‌కు బంగారు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చిచేరింది. మణిపూర్ మాణిక్యం మేరీకోమ్ ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ విభాగం

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:58 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చిచేరింది. మణిపూర్ మాణిక్యం మేరీకోమ్ ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ విభాగంలో ఆమెకు గోల్డ్ మెడల్ వరించింది.
 
కాగా, ఐదు నెలల క్రితం ఆసియా చాంపియన్‌‌షిప్‌‌ను గెలుచుకున్న మేరీ.. అదే దూకుడును కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ ప్రదర్శించింది. ముఖ్యంగా, ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ బౌట్‌లో చెలరేగిన తీరు అందర్నీ ఆకట్టుకున్నది. మేరీ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ గోల్డ్ మెడల్ చేరింది. 
 
ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ మేరీ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిళ్లు మేరీ ఖాతాలో ఉన్నాయి. మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రిలీజైన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments